Select Songs Year Wise .....

పూరీ డైరెక్షన్ లో ‘గబ్బర్ సింగ్’గా రవితేజ..


‘గబ్బర్ సింగ్’ కోసం తెగ వెతుకులాట ప్రారంభించాడట పూరీ. ఇదేదో పవన్ కళ్యాణ్ సినిమా పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడనుకునేరు. అదేంకాదు ఆ మధ్య గురుడు వర్మ అలనాటి సూపర్ హిట్ ‘షోలే’ని చిత్రవథ చేసి, జనం మీదకి వదిలేసి బాక్సీఫీస్ ముందు బొక్కబోర్లా పడితే తాను మాత్రం ఇదే చిత్రాన్ని తెలుగుదనంతో మల్టీస్టారర్ గా తీస్తానంటూ సిద్దమైపోతున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రంలో హీరోలుగా ప్రభాస్, గోపిచంద్ లని ఎంపిక చేసినట్టు తెలుస్తున్నా, ‘షోలే’లో గబ్బర్ సింగ్ పాత్రకి ప్రత్యేక ప్రాధాన్యతని అంజద్ ఖాన్ తన వాగ్పటిమతో, నటనా చతురతో చేకూరిస్తే..దాన్ని అమితాబ్ అనుకరించినా పండించలేక పోయాడు. ఇప్పుడు ఈ తెలుగు ‘గబ్బర్ సింగ్’కి పూర్తి స్థాయి కామెడీని జోడించేలా చూస్తూనే, రవితేజని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడట పూరీ. అసలే అమితాబ్ చేసిన పాత్ర కావటంతో ఈ వీరాభిమాని ఒప్పేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z