Select Songs Year Wise .....

నయనతారకు హాట్ అనుష్క ఎసరు..?


తమిళ ‘బిల్లా’లో నయనతార చేసిన క్యారెక్టర్‌ ను తెలుగు ‘బిల్లా’లో అనుష్క చేయడం తెలిసిందే. తమిళంలో నయనతారలాగే, తెలుగులో అనుష్కతో బికినీ వేయించడం, అది ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారడం కూడా తెలిసిందే. ఇప్పుడు ‘బిల్లా’ చిత్రానికి సీక్వెల్‌ ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.‘బిల్లా2’ పేరుతో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అనుష్కను తీసుకుంటున్నారని కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌ గా అనుష్కను తీసుకోవడం వలన, రెండు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేసుకోవచ్చని, విడివిడిగా రెండు భాషల్లో సినిమా తీయాల్సిన అవసరం లేదని భావిస్తున్నందున.. ఇక ‘బిల్లా-2’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం జరగదు.‘బిల్లా’ చిత్ర కథానాయకుడు అజిత్‌ ‘బిల్లా2’లోనూ నటించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్‌ తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో ఒక చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ముందే ‘బిల్లా2’ విడుదలయ్యే అవకాశం ఉంది.!
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z