Select Songs Year Wise .....

టబు కోసం పద్మశ్రీ రెకమెండ్ చేసింది నాగార్జున?



ఎంతో ప్రతిష్టాత్మక బిరుదులు పద్మాలు..ఈ పద్మాలు ఏ వ్యక్తికైనా వచ్చాయంటే ఆ వ్యక్తి ఎంతో కొంత ప్రజాసేవ ఐనా చేసి ఉండాలి, లేదా ఏదో ఒక రంగం నిష్ణుతుడై ఉండాలి. కానీ ఈ పద్మశ్రీలు, పద్మ భూషణలు, పద్మవిభూషణలు బజారులో కూరగాయలు కొనుక్కొనే రీతిలో బడా పెద్ద మనుషులు కొనుక్కొంటున్నారు. కొద్దమందికి మాత్రమే(సామర్థ్యం ఉన్న వ్యక్తులకు) ఈ పద్మాలు ఇచ్చి మిగిలినవన్నీ అమ్ముకోవటమో లేక రికమెండ్ ప్రభావంతో ఇవ్వటమో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. ఆ తంతు ఇప్పుడు మళ్లీ జరిగింది. ఏ కొద్ది మందికో అర్హులైన వారికి పద్మాలు ఇచ్చి పాత పద్దతులలోనే అవార్డులను పంచారు.

ఈ పంచే అవార్డులలో సినీ నటి టబు ఉన్నారని ఫిలిం నగర్ లో ఒకటే గోల. ఇంతకీ టబుకు పద్మశ్రీ ఇప్పించే అవకాశం ఎలా దొరికొంది?ఎవరు రికమెండ్ చేశారు? ఫిలింనగర్ న్యూస్ ప్రకారం టబుకి పద్మశ్రీని రికమెండ్ చేసింది ఎంపి టి సుబ్బిరామిరెడ్డి అని టాలీవుడ్ చెప్పుకుంటోంది. అఫ్ కోర్స్ టి సుబ్బిరామి రెడ్డికి చెప్పి పద్మశ్రీ ఇప్పించగలిగే శక్తి సామర్థ్యమున్న హీరో ఎవరో మనం సులభంగా ఊహించుకోవచ్చు. ఇంకెవరో కాదు అక్కినేని నాగార్జున, ఒకప్పుడు టబుకి స్నేహితుడు, ఒక మంచి విల్లా’ను బహుమతిగా ఇచ్చిన ఘనుడు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు సుబ్బిరామి రెడ్డికి ఎంతో అన్యోన్యమైన స్నేహసంబందాలున్నాయని వేరే చెప్పకర్లేదు. కావున టబుకి పద్మశ్రీ ఇప్పించటం పెద్ద లెక్కలో లేనిదని, గతంలో సుబ్బిరామి రెడ్డి ఇటువంటి పనులు ఎన్నో చేశారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z