Select Songs Year Wise .....
సిద్ధార్ధ సినిమాలు వరస ఫ్లాపులు కావటానికి కారణం ఒకటే
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సిద్దార్ధ. అయితే ఈ మధ్య సిద్దార్ద చేసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. వరసగా 'కొంచెం ఇష్టం, కొంచెం కష్టం', 'బావ', తాజాగా 'అనగనగా ఓ ధీరుడు' ఇటు నిర్మాతలను, అటు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈ హీరో గారుతో సినిమా తీస్తే అంతే సంగతి అన్నట్లు తయారైంది. మొదట 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి వేరే హీరోని అనుకున్నా దర్శకుడు ప్రకాష్ పట్టుబట్టి సిద్దార్దని హీరోగా తీసుకున్నారు. అప్పటికీ అతని తండ్రి రాఘవేంద్రరావు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోలేదని, సిద్దార్దతో పెట్టుకుంటే ఇంతేనని ఇప్పటికి తెలిసి ఉంటుందని అంటున్నారు.
అస్సలు సిద్ధార్ధ సినిమాలు వరస ఫ్లాపులు కావటానికి కారణం ఒకటే చెప్తున్నారు. అది అతను దర్శకత్వ విభాగంలో వేలు పెట్టడం. గతంలో మణిరత్నం వద్ద దర్సకత్వ విభాగంలో పనేచేసిన అనుభవాన్ని ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేసి మొదట దర్శకులతోనూ, ఆ తర్వాత నిర్మాతలతోనూ ఫైనల్ గా ప్రేక్షకులతోనూ ఆడుకుంటున్నాడంటున్నారు. అతనితో పనిచేసిన దర్శకులు మరో సారి అతన్ని తమ సినిమాలో తీసుకోవటానకి ఆసక్తి చూపకపోవటాన్ని బట్టే పరిస్ధితి అర్ధం చేసుకోవాలంటున్నారు. ఇక సిద్దార్ద ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా కొత్త దర్శకుడు వేణు శ్రీరామ్ ని పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం కమిటయ్యాడు.