
ప్రస్తుతం రంజితకు ఉన్న క్రేజ్ ను సినిమాలో పెట్టి క్యాష్ చేసుకుందామని నిర్మాతల దురాలోచన అన్నమాట. అయితే రంజిత మాత్రం రోజుకు 5లక్షల డిమాండ్ చేస్తుంది. అయినా ఆ రేటుకు నిర్మాతలు ఒప్పుకుంటున్నారని కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజుకు 5లక్షల డిమాండ్ చేసే నటుడు కోలీవుడ్ లో ఒక్క ‘వడివేలు’ మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ లో ఇంత మొత్తం తీసుకున్న నటుడు కానీ, నటిగానీ లేరని చెప్పచ్చు. ఏమైతేనెం రాసలీల రంజితకు ఇప్పుడు సినిమా నటిగా మరలా పుంజుకొందని చెప్పొచ్చు.