Select Songs Year Wise .....

మళ్లీ ఇలియానా తమిళ చిత్రం


ప్రస్తుతం ఇలియానా నటిస్తున్నది ‘3 ఇడియట్స్’ తమిళ వెర్షన్. ఐదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రం చేస్తుండటం థ్రిల్‌గా ఉందని ఆమె అంటున్నారు. ‘కేడి’ చేస్తున్నప్పుడు తమిళ భాషపై కొంచెం పట్టు కుదిరిందట. అయితే ఈ ఐదేళ్లల్లో తమిళ సినిమాలు చేయలేదు కాబట్టి మళ్లీ కొత్తగా తమిళ పాఠాలు మొదలుపెట్టానని ఇలియానా అంటున్నారు. ‘3 ఇడియట్స్’ కోసం ఈ బ్యూటీ పెళ్లి కూతురి గెటప్‌కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సీన్ పూర్తయిన తర్వాత ‘బాగా యాక్ట్ చేశావ్’ అని ఇలియానాను శంకర్ అభినందించారట.

అంత పెద్ద దర్శకుడి అభినందనలు అందుకున్నందుకు ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇలియానా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీ తెరపై కూడా కనిపించబోతున్నారు. హిందీలో ఆమె ‘బర్ఫీ’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావడానికి మరికొంత సమయం పడుతుందట. తెలుగులో తను నటించిన ‘నేను నా రాక్షసి’ విడుదలకు సిద్ధమవుతోంది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z