Select Songs Year Wise .....

పవన్ కళ్యాణ్ సోదరుడిగా శ్రీకాంత్


పవన్ కళ్యాణ్ హీరోగా మిరపకాయ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్రం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దబాంగ్’కి రీమేక్. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ అర్బాజాన్ ఖాన్ రీమేక్ రైట్స్ ఎవ్వరికీ ఇవ్వబోమని, అమ్మబోమని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు రీమేక్ రైట్స్ కు అంగీకరించినట్టు సమాచారం. ఈ రీమేక్ రైట్స్ పవన్ కళ్యాణ్ తీసుకొన్నందుక చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రం రీమేక్ కు పవన్ కళ్యాణ్ రైట్ పర్సన్ అని తన అనందాన్ని వక్తపరిచారు.

కాగా ఈ చిత్రానికి పవన్ కళ్యాణే ప్రొడ్యూసర్ అని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించి పస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఈ చిత్రానికి హైప్ ఇచ్చే రేంజ్ లో ఉండటం విశేషం. అయితే ఈ చిత్రానికి సంబందించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికి వస్తోంది. దబాంగ్ సినిమాలో అర్బాజాన్ ఖాన్ చేసిన పాత్రను ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడిగా శ్రీకాంత్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే ఈ ఆఫర్ ని అంగీకరించి నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాజల్ హీరోయిన్ గా నటించనుంది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z