Select Songs Year Wise .....

వీర సినిమా మరో విక్రమార్కుడట!


ఇటీవల ‘మిరపకాయ్’తో మరో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో జమ చేసుకున్న రవితేజ ఈ వేసవికి ‘వీర’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, తాప్సీ నాయికలుగా చేస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ రవితేజ శైలిలో సాగే పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఇది.

ఈ చిత్రంలో రవి రెండు విభిన్నమైన పార్శ్వాలు గల పాత్ర చేస్తున్నారు. కాజల్ కబడ్డీ చిట్టిగా నటిస్తోంది. ఆమె తొలిసారిగా పుల్‌లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తున్నారు. తాప్సీ ఐటీ స్టూడెంట్‌గా నటిస్తున్నారు. పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘విక్రమార్కుడు’ తర్వాత అంతటి పవర్‌ఫుల్‌గా రవితేజ పాత్ర వుంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. ఇటీవలే రవితేజ, కాజల్‌పై ఓ పాటను చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది.

మేలో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో వుండే ఎనిమిది ఫైట్స్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు. కిక్ శ్యామ్, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, రోజా, రాహుల్‌దేవ్, ప్రదీప్‌రావత్, సుప్రీత్, ప్రభాకర్, ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఛోటా.కె.నాయుడు, సంగీతం: థమన్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z